Saturday, May 15, 2010

నా ఎంకి తత్వాలు-by Vasudev

నా ఎంకి తత్వాలు
__ వాసుదేవ్
"ఏవొఁయ్, ఇటు కాస్త చూడవోయ్" ఆమె అందం అరిచింది
"కాస్త ఆగవమ్మా, నడుము ముడతలు చూడనీ" మనసు అర్ధించింది.
కిలాకిలా నవ్వింది నా ఎంకి నా మనసు తెలుసుకున్నదై
నిండు కడవను తన నడుము ముడతల్లొ ఇముడ్చుకున్నదై
ముందుకెళ్ళినకొద్దీ ఆమె అందం ఊరించసాగింది
ముందరి కాళ్లకు బంధం వేస్తూ ఆమె పైట జారింది
త్రుళ్ళిపడిన ప్రకృతి చిన్నబోయింది ఆమె అందాన్ని బేరీజువేస్తూ
నా ఎంకి మాత్రం ముందుకుసాగింది పైట సరిజేస్తూ
పైటదా, కడవదా తప్పు, కలవరపడింది నా ఎంకి
"కడవదె తప్పు, జారింది" అంది ఎంకి బొంకి
"అయ్యో! కడవపెంకులు భాధించాయా?" ఆతృత పడ్డాను
"నడుము పెగల్లేదుకదా" ఆదుర్దా చెందాను
"కడవపెంకులు మృదువే! నీ దృక్కుల నొక్కులే బాధలు"
రాయి, రప్ప మెత్తనె, నీ చూపు స్పర్శలె వ్యధలు"
"భాధించాయా ఎంకీ? ఎక్కడెక్కడ నొప్పించాయి ఈ ముక్కలు?"
కర్కశమైన ఈ రస్తాలొ నొప్పెట్టాయా నీ పిక్కలు?"
"చాల్లే సామీ!జారిన పైటని సర్దారా ఏమి!
నడువొంపునె గదా చూస్తుండారు కామి!"
"అవునే ఎంకి! నీ ఊరుపుల తీర్పును కళ్ళకద్దుకున్నాను
నీ జఘనాల వైభవాన్ని అంది పుచ్చుకోవాలనుకున్నాను!"
ఆఁ నాబోటివాళ్ళం మీకు ఆన్తామా ఏంది కద్దూ!
నా అందాలు ఈ అడవమ్మటె పోతాయి పోదూ!"
"అవునే ఎంకీ! నీకు తెలుసా నువు అందగత్తెవని?
నీ వొంటి కూరుపు నిన్ను నిలబెడుతుందని, సొగసుగత్తెవని!"
"పొండి సామీ నా జింకలకె ఎరుక నా బింకం
చూద్దురా అన్ని హంగుల్లో నా అవయవాల పొంకం!"
"నువు ప్రకృతివే ఎంకీ! నా భావుకత్వానికి ఆకృతివి
నా విచారానికి వికృతివి, నా అందమైన ఆరాధనకి కృతివి!"
ఐతే సామీ ! నా అందం మీ కేమన్పించింది?
నా బింకం మీ కేం పాఠాలు నేర్పించింది?"
"సొగసుచూడతరమా! నీ అందం ప్రేరేపించింది
నీ హొయలు నా మనసు తీగలు మీటింది
"అంతేనా సామీ! ఇంకెమీ అన్పించట్లేదా?
నా అందాలు మీకేం కనువిప్పు కల్గించట్లేదా?"
"ఎందుకు లేదు ఎంకీ! నీ అందాలు నా బాహ్యద్వారాలు తెరిచాయి
నీ హొయలు, నీ సొగసు నా కర్తవ్యాన్ని గుర్తించాయి"
"అంతేనా సామీ! ఇంకేదో ఆశించాను
నా పొంగులతొ ఇంకా పొందాలనుకున్నాను!!!
"నా అందాలన్ని ఇక్కడ ప్రకృతిలో కూడా ఉన్నాయి
కానీ నాకూ వీటికి భేధం కనిపెడ్తున్నాయి,
నా కంటె అత్యధ్భుత మైన జీవం వీటిల్లో ఉంది
మనందరికి అన్ని రకాల కనువిందు చేస్తూంది
"కానీ ఎంకీ నువ్వంటే ప్రాణంతో ఊగిసలాడ్తున్నావు
ఈ ప్రకృతి మాత్రం తనలోని అందాలతొ ఉర్ర్రూతలూగిస్తున్నది
"కాని సామీ! నాది రేపటికి వాడిపోయే అందం
కానీ ఈ ప్రకృతి, నిత్యయవ్వనంతొ ఊగిపోయే చందం!"
"ఐతే ఏం చెప్పాలనుకుంటున్నావు ఎంకీ!
అందాలని చూపిస్తూ అవి తప్పని చెప్తున్నావు పెంకీ!
"సామీ! నా అందాలు గొప్పవే కానీ క్షణభంగురం
కానీ ఈ ప్రకృతి అందాలు నా సవతి, గుణభంగురం"
"అవునే ఎంకీ! నీ అందాలు నా క్కనువిందు
దారిపట్టించె నీ జీవితసత్యాలు మహాపసందు"
౦*౦*౦*౦*౦*౦*౦*౦*౦*౦*౦

2 comments:

  1. so appanna naidu garu, you are a very romantic person, who see beauty all around u and in nature. nice

    ReplyDelete
  2. The comment applies to Sri Vaasudev who wrote the above poem

    ReplyDelete