Thursday, November 19, 2009

అమ్మా, నిన్ను చూడాలనివుంది

అమ్మా, నిన్ను చూడాలనివుంది

By Adari Appanna Naidu
Edited By Adari Srinivas

అమ్మా, నీ మనసు తెల్లదని తెలుసుకున్నాను
కాని నిన్ను కౌగలించకపోయాను.
అమ్మా, నీ రంగు చామన ఛాయని తెలుసుకున్నాను
కాని నిన్నుచూడలేకపోయాను.
అమ్మా, నీవు చాలా పొడవని తెలుసుకున్నాను
కాని అది నీ వయసుకులేదని తెలియకపోయాను.
అమ్మా, నీవు చాలా మంచి వ్యక్తిఅని తెలుసుకున్నాను
కాని ఆ మంచితనాన్ని అనుభవించలేకపోయాను.
అమ్మా, నా సుఖదుఃఖాలు నీతో పంచాలనుకున్నాను
కాని అంత మంచి భాగ్యము నాకు లేదని తెలుసుకున్నాను.
అమ్మా, నీవు ఒక అందమైన స్త్రీ అని మీ స్నేహితులు చెప్పగా విన్నాను
కాని ఆ అందాన్ని ఛాయాగ్రహములోమాత్రమే చూడగలిగాను.
అమ్మా, నీ వొడిలో పడుకోవాలనివుంది
కాని అది ఈ లోకములో సాధ్యముకాదని గ్రహించాను.
అమ్మా, నీతో ఒక్కసారి నడవాలనివుంది
అది స్వర్గములో జరుగునని నమ్ముచున్నాను.
అమ్మానిన్ను ఒక్కసారైనా చూడాలనివుంది
కలలోలైనా చూడగలనని ప్రార్ధిస్తున్నాను.

2 comments:

  1. Once again a good rendering of one's feelngs for his lost mother.This agonising son bemoans loss of his mother and tries to visualise her in these lines. Good luck Appannaji and keep writing.
    Vasudev

    ReplyDelete
  2. You are right Vasudev. Will I see her in my dreams or will I see her on my return to our permanent place is still a question. TQ Vasudev

    ReplyDelete