Thursday, October 29, 2009

నా కవిత 10-అమ్మా, నిన్ను చూడాలనివుంది

అమ్మా, నిన్ను చూడాలనివుంది

రచన -అప్పన్న నాయుడు

అమ్మా, నీ మనసు తెల్లదని తెలుసుకున్నాను
కాని నిన్ను కౌగలించకపోయాను.
అమ్మా, నీ రంగు చమచాయని తెలుసుకున్నాను
కాని నిన్నుచూడలేకపోయాను.
అమ్మా, నీవు చాలా పొడవని తెలుసుకున్నాను
కాని అది నీ వయసకులేదని తెలియకపోయాను.
అమ్మా, నీవు చాలా మంచి వ్యక్తిఅని తెలుసుకున్నాను
కాని ఆ మంచితనాని అనుబవించలేకపోయాను.
అమ్మా, నా సుఖదుక్కాలు నీతో పంచాలనికున్నాను
కాని అంత మంచి బాగ్యము నాకు లేదని తెలుసుకున్నాను.
అమ్మా, నీవు ఒక అంధమైన స్త్రీఅని మీ స్నేహితులు చెప్పగా విన్నాను
కాని ఆ అందాని చయాగ్రహములోమాత్రమే చూడగలిగాను.
అమ్మా, నీ వొడిలో పడుకోవలనివుంది
కాని అది ఈ లోకములో సాధ్యముకాదని గ్రహించాను.
అమ్మా, నీతో ఒక్కసారి నడవాలనివుంది
అది స్వర్గములో జరుగునని నమ్ముచున్నాను.
అమ్మానిన్ను ఒక్కసారైనా చూడాలనివుంది
కలలోలైనా చూడగలనని ప్రార్ధిస్తున్నాను.
Amma Ninnu Choodaalanivundhi

By- Adaari Appanna Naidu


Amma, nee manasu thelladhani thelusukunnanu
Kaani ninnu kaugalinchakapoyaanu
Amma, nee rangu chamachayani thelusukunnanu
Kaani ninnu choodalekapoyanu
Amma, neevu chaala podavani thelusukunnanu
Kaani adhi nee vayasukuledhani theliyakapoyanu
Amma, neevu chaala manchi vyakthiani thelusukunnanu
Kaani AA manchithanaani anubavinchlekapoyanu
Amma, naa sukadhukkalu neetho panchalanikunnanu
Kaani antha manchi bagyamu naaku ledhani thelusukunnanu
Amma, Neevu oka andhamainan sthreeani mee snehithulu cheppagaa vinnanu
Kaani AA andhani chayagrahmulomaathramE choodagalganu
Amma, nee vodilO padukovalanivundhi
Kaani adhi EE lokamulO sadhyamukadhani grahinchaanu
Amma, Neetho okkasaari nadavalanivundhi
Adhi Swargamulo jarugunani nammuchunnanu
Amma, ninnu okkasaaraina choodalanivundhi
Kalalolainaa choodagalanani prardhisthunnanu


This Kavitha is dedicated to my mother who is no longer in this material world

No comments:

Post a Comment