Saturday, November 12, 2011

మారిషస్‌లో మనవాళ్లు, మనభాష.-

మారిషస్‌లో మనవాళ్లు, మనభాష.- పాలంకి సత్య సెల్:9848088775
November 5th, 2011

భారతదేశంలోనే ఉండిపోయిన వారికన్నా ప్రవాస భారతీయులలోనే భారతీయ సంస్కృతిపైనా, మాతృభాషపైనా మమకారమెక్కువనీ, వారే

సంస్కృతీ, సంప్రదాయాలను నిలబెడుతున్నారనీ, తెలుగు భాషను పరిరక్షిస్తున్నారనీ ఒక వాదం తరచు వినిపిస్తూ ఉంటుంది. ప్రవాస

భారతీయులంటే ముందుగా గుర్తువచ్చేది అమెరికా వాస్తవ్యులు. యల్లాప్రగడ సుబ్బారావుగారి వంటి మహామహులను వదిలేస్తే అమెరికాకు

భారతీయులు వెళ్ళడం ఆరంభమైంది 1970లలో, 1980, 90లలో ఎక్కువ. ఈ శతాబ్దిలో సామాన్యమైపోయింది. అక్కడ జరిగే సభల

గురించీ, నిర్వహించే తెలుగు తరగతుల గురించీ వార్తాపత్రికలలో చదువుతూ ఉంటాం.


ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అమెరికాకు వలస వెళ్ళినవారి పిల్లలలో ఎందరికి తెలుగు స్వచ్ఛంగా, అమెరికా యాస లేకుండా

మాట్లాడడం వచ్చును? 1970లలో వెళ్ళిన వారి మూడవ తరానికి తెలుగుతో పరిచయమైనా ఉందా? రాజకీయ, ఆర్థిక కారణాలవల్ల

అమెరికాకు వలసలు ఆగిపోతే (ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ప్రవాసులవల్ల ఉద్యోగాలు రావడం లేదన్న అసంతృప్తి అమెరికావారిలో

ఉంది) అక్కడే ఉండిపోయిన ప్రవాస భారతీయులు ఎంతకాలం తెలుగు భాషతో సంబంధాన్ని నిలుపుకోగలరు? విదేశంలో, ఆంగ్లం అధికార

భాష, వ్యవహార భాషా అయిన చోట అది సాధ్యమేనా?

సాధ్యమే అంటున్నారు మారిషస్‌లోని తెలుగువారు. మొట్టమొదటగా తెలుగువారు తెలుగునాటిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులుగా

1837వ సంవత్సరంలో మారిషస్‌లో అడుగు పెట్టారు. అక్కడ అధికార భాష ఆంగ్లం. వ్యవహార భాష ఫ్రెంచి. రోడ్లమీద బోర్డులూ,

దుకాణాలపైన పేర్లూ ఫ్రెంచిలో ఎక్కువగా, ఆంగ్లంలో అక్కడక్కడా ఉంటాయి. ప్రజాసామాన్యం మాట్లాడుకునే భాష ఫ్రెంచి, ఆఫ్రికన్ సంకరమైన

క్రియలే. దేశానికి స్వాతంత్య్రం లభించాక కరెన్సీ నోట్లపై ముద్రితమైన భాషలు ఆంగ్లం కాకుండా హిందీ, తమిళం మాత్రమే. (తమిళ సోదరులకు

జోహారు. ఎక్కడున్నా, ఎప్పుడైనా తమ భాషను పరిరక్షించుకోగలరు). అటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా నాలుగు తరాలు గడిచినా

తెలుగు భాషతో అనుబంధాన్ని మారిషస్ తెలుగు వారు తెంచుకోకుండా ఉండడం ప్రశంసనీయం కదా!

మారిషస్ దేశంలో తెలుగు భాషకున్న మంచి స్థానం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యానందాలు కలుగుతాయి. అక్కడ మొత్తం తెలుగువారి సంఖ్య

అరవైవేలు మాత్రమే. అయితే ప్రతి ఊరిలోనూ ఆంధ్ర మహాసభ శాఖ ఉన్నది. (ఆంధ్ర మన్నది తెలుగుకి పర్యాయపదంగా వాడబడుతున్నది

తప్ప తెలుగు నాటిలోని ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు. క్రీడాభిరామంలో ఆంధ్ర నగరమన్నమాట ఓరుగల్లు లేదా వరంగల్లు గురించి కవి

ప్రయోగించారు). ఆంధ్రమహాసభ శాఖలు 95 కాగా, ముఖ్యమైనది దేశరాజధాని పోర్ట్ లూరుూలో ఉంది. మద్రాసు రాష్ట్రం నుంచి వేర్పడి

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికై ప్రాణాలర్పించిన పొట్టిశ్రీరాములుగారి విగ్రహాన్ని వారు ప్రతిష్ఠించుకున్నారు. భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటువల్ల

అక్కడ తెలుగువారికి ఒరిగిందేమీ లేదు. మాతృరాష్ట్రంతో బంధాన్ని ఎన్నో దశాబ్దాలుగా దూరంగా ఉన్నా తెంచుకోలేదన్నదానికి ఇది ఉదాహరణ.

ప్రతి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు నేర్చుకునే సదుపాయముంది. ఆంగ్లేయుల ఏలుబడిలో కూడా విద్యార్థులకు ఆంగ్లం

ప్రథమ భాషగా, ఫ్రెంచి ద్వితీయ భాషగా, మాతృభాష మూడవభాషగా నేర్పేవారు. నేడూ అంతే. మాతృభాష నేర్వకుండా పట్టాలు

సంపాదించడం భారత దేశంలోవలె సాధ్యం కాదు. అరవైవేల మంది తెలుగువారికి 145 మంది ప్రాథమిక పాఠశాలలో, 67 మంది ఉన్నత

పాఠశాలలో, 9 మంది కళాశాలలో ఉన్నారు. దామాషా పద్ధతిన చూస్తే ఇక్కడ ఎందరు తెలుగు బోధన చెయ్యాల్సి వస్తుంది? ఇతర రాష్ట్రాలలో

తెలుగువారికి తెలుగు నేర్చుకునే అవకాశాలు ఎన్ని ఉన్నాయి?

విద్యాలయాలలో నేర్చుకునే తెలుగుకి తోడుగా ఆంధ్ర మహాసభలో కూడా నేర్చుకునే అవకాశముంది. కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యం

నేర్పిస్తారు. ముగ్గులు వెయ్యడం కూడా నేర్చుకోవచ్చు. మారిషస్‌లో ముగ్గులు మగవాళ్ళే వేస్తారు! కళా సాంస్కృతిక మంత్రాలయ

(ప్రభుత్వశాఖ) నిర్వాహకులు నాటిక పోటీలు నిర్వహిస్తారు. స్థానిక రచయితలూ, నటీనటులూ పాల్గొంటారు.

ప్రతిరోజూ ఆకాశవాణి (రేడియో)లో మూడుగంటలు తెలుగు కార్యక్రమాలు ప్రసారవౌతాయి. అక్కడ దూరదర్శన్‌లో వారానికి రెండు

ధారావాహికలు, మాసానికి రెండు చలనచిత్రాలూ, ఇంకా ఇతర కార్యక్రమాలూ ఉంటాయి. మన దేశంలో తెలుగువారు ఎక్కువగా ఉన్న

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా తెలుగు కార్యక్రమాలు ఇంతగా ప్రసారం కాకపోవడం శోచనీయం కాదా?

ప్రథమావిభక్తి ప్రత్యయాలైన డు, ము, వు, లు పుస్తకాలకే మనమిక్కడ పరిమితం చేశాం. రాముడు, కృష్ణుడు వంటి పేర్లు ముందు

తరాలలోనే వదిలేశాం. మారిషస్‌లో తెలుగు సాహిత్యంలో, భాషాభివృద్ధిలో విశేష కృషి చేస్తున్న ముఖ్యులలో ఒకరిపేరు సంజీవ

నరసింహఅప్పడు. ఇటువంటి తెలుగు ప్రత్యయాలతో అంతమయ్యే పేర్లక్కడ సామాన్యం. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను వారు

నాలుగైదు తరాలు గడిచినా మరిచిపోలేదన్నదానికి ఇది ఒక ఉదాహరణ. నూటయాభై సంవత్సరాలు మాతృ రాష్ట్రానికి దూరంగా నివసిస్తున్నా

మాతృభూమితో ప్రత్యక్ష సంబంధానికి అవకాశం లేకపోయినా భారత సంప్రదాయాలనూ, మాతృభాషనూ విస్మరించకుండా రక్షించుకుంటూ

ఉండడానికి కారణమేమిటి? ప్రస్తుతం అమెరికాకు వెళ్ళేవారంతా (కొందరిని మినహాయిస్తే) డాలర్ల వ్యామోహంతో, భోగ భూమిపై ఆశతో,

మంది మనస్తత్వంతో వెళ్ళేవారే. మారిషస్‌కి వెళ్ళినవారు అలా వెళ్ళినవారు కాదు. 19వ శతాబ్ది ఆరంభం వరకూ మారిషస్ చెరుకు తోటలలో

నల్లవారు బానిసలుగా పనిచేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం బానిస విధానాన్ని రద్దు చేసింది. తోటలలో పని చెయ్యడానికి కార్మికులు

అవసరమయ్యారు. అప్పుడు మనదేశం పరాయి పాలనలో మగ్గిపోతున్నది. ఆ సమయంలోనే భయంకర క్షామం సంభవించింది. (ఆ కరువే

ఆర్థర్ కాటన్ మనస్సులో గోదావరిపై ఆనకట్ట కట్టాలన్న బీజం వేసింది). తప్పనిసరైన పరిస్థితులలో తెలుగు నాటిలోని వేర్వేరు ప్రాంతాలలోని

కార్మికులు వ్యవసాయ పరికరాలతో ఓడ ప్రయాణం చేసి మారిషస్ చేరుకున్నారు. తెలుగువారు దిగిన రేపుపట్టణం కొరింగ.

కోపంవచ్చినప్పుడూ, వెక్కిరించడానికీ తెలుగువారిని ఇతరులు కొరింగీలంటారు. (మద్రాసులో తెలుగువారిని గొల్టీలంటారు. ఈమాట ఉత్పత్తి

తెలియదు). వ్యవసాయ పరికరాలతోపాటు సాహితీ వ్యవసాయ పరికరాలైన భారత, రామాయణ, భాగవతాలూ, వేమన శతకం, నరసింహ

శతకం, ఎడ్లరామదాసు శతకం వంటి ఎన్నో గ్రంథాలను తమవెంట తీసికెళ్ళారు. ఇష్టపడి ధనవ్యామోహంతో వెళ్ళడం వేరు. కష్ట పరిస్థితులలో

జీవనోపాధికై వెళ్ళడం వేరు. అలా వెళ్ళిన వారికే ఎన్ని తరాలు గడిచినా మాతృభాషాభిమానం, మాతృదేశ సంస్కృతిపై గౌరవం తగ్గిపోవేమో.

ఇదే విషయాన్ని మనం ఫిజీద్వీపాలలో, సూరినాందేశంలో గమనించవచ్చు. శివరాత్రికి కాలి చెప్పులైనా లేకుండా కావిడిలో అభిషేకజలం

మోసుకెళ్ళడాన్ని కూడా చూడవచ్చును. ఎటొచ్చీ అభివృద్ధి చెందిన ధనిక దేశాలు కావు కనుక వీరు ప్రచారం చేసుకోలేరు.

మారిషస్‌లో తెలుగు ప్రైవేటు చానెళ్ళు ప్రసారం కావు. ఎంగిలి మంగలమైన ఇంగ్లీషు ను తప్పులు తడకలుగా గుప్పిస్తూ సంకర టింగ్లీషుని

కాకుండా స్వచ్ఛమైన తెలుగు మారిషస్ వాస్తవ్యులు మాట్లాడుతారు. ఇలా మాట్లాడడానికి ఇదే ముఖ్య కారణం. కుల, ప్రాంత భేదాలతో వేరు

కుంపట్లు పెట్టుకోకుండా అందరూ తెలుగువారమనుకోడం అన్నిటికన్నా ముఖ్య కారణం.


. .

1 comment:

  1. The above article appeared in Andhra Bhoomi telugu newspaper

    ReplyDelete