Monday, July 20, 2009

BEAUTIFUL LETTER FROM SRI SANJIVA FROM MAURITIUS

సర్వ శ్రీ అప్పన్న అప్పెలనాయుడు గారి కి మా వందనములు మరి ఆంధ్ర పుణ్య భూమి కి మా సహస్ర కోటి పాదాభివందనములు.మారిషస్ చిన్ని దీవి లో పుట్టి పెరిగానండీ. మా పూజ్యనీయులైన పూర్వికులందరూ మీ ఆంధ్ర పుణ్య భూమి , విజయనగరం నించి రెండు వందల సమ్వత్సరాల క్రితం సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి స్థిరదద్దారు. మేము వాళ్ళ సమ్తతులం. తెలుగు భాష, సాహిత్యాలు, సంస్కృతి సంప్రదాయాలు, తెలుగు ఆచార వ్యవహారాలు, తెలుగు వాళ్ళ కట్టు జుట్టు తీరు ముత్యాల ముగ్గుల వరకు పరిరక్షిస్తున్నాము.ఇక్కడ మా ప్రభుత్వపు ఉన్నత పాఠశాలలో తెలుగు విభాగాధిపతిగా పని చేస్తున్నానానండీ. తత్ద్వారా మారిషస్ ప్రభుత్వపు జాతీయ ఆకాశ వాణి నిలయము మరి దూరదర్శన కేంద్రము లో తెలుగు ప్రసారకుడిగా పని చేస్తున్నానండి.నేను తెలుగు లో మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు పరిశిధ్ధమైన పద ఆరు ఆణాల తెలుగు లోనే మా భావాలను ప్రకటిస్తానాండి. నా తెలుగు లో ఆంగ్ల పదాలు కనిపించడం సాధ్యమ్ కాదు సుమా !ఉంటాను మరీసంజీవ నరసిమ్హ అప్పడు

3 comments:

  1. Sanjiva is one rare person who never stops his efforts anything to do with Telugu. People call him Telugu Sanjiva :) That's an honour.

    ReplyDelete
  2. I agree with you Dr. Bhaskar. He is truly a Telugu Sanjiva. Can you imagine how wonderful this world will be if everyone is like him.

    ReplyDelete
  3. మనసు కదిలించింది. ఇక్కడ "ఆంధ్రదేశం"లో, ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున, టివిలో ఎక్కడ చూసినా విడిపోదామనే వార్తలే. మరి "ఆంధ్ర పుణ్యభూమికి ప్రణామములు" అంటూ పలకరించే మంచి మనుషులని చూసి పులకరించి పోయాను. పోయిన వారమే "తెలుగు చచ్చిపోతోంది" అని స్నేహితులతో వాపోతున్నాను!
    ఇప్పుడు ఎంతో ధైర్యము వచ్చింది, మన తెలుగు భాష సంస్కృతి మన పుణ్యభూమి బయటనే బ్రతుకుతుంది, సజీవంగా వుంటుంది అని! పుణ్యభూమి(?) ఏమైనా ఫరవాలేదు :(
    Satyam Bheemarasetti

    ReplyDelete