తెలుగు పాటకు అంతర్జాతీయ ఖ్యాతి
తెలుగు పాటకు అరుదైన గౌరవం దక్కింది. ఏటా అమెరికా అందించే 'జస్ట్ ప్లెయిన్ ఫోక్ అవార్డు(జేపీఎఫ్)' భారతీయ సంగీతం విభాగంలో సంగీత దర్శకుడు, బీఎస్‌ఎన్‌ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ జె.శ్రీకృష్ణను వరించింది. శ్రీకృష్ణ సంగీత దర్శకత్వంలో వచ్చిన 'అంతా సాయి' ఆధ్యాత్మిక ఆల్బమ్‌కు ఈ పురస్కారం లభించింది. 163 దేశాలకు చెందిన స్వర మాంత్రికుల సంగీత దర్శకత్వంలో వచ్చిన 42వేల ఆల్బమ్స్ ఈ పోటీలకు వచ్చాయి. ఫైనల్స్‌కు 11 ఆల్బమ్స్ చేరాయి. ఆగస్టు 29న అమెరికాలో వీటిని ప్రకటించారు. వీటిలో ఉత్తమ భారతీయ సంగీత విభాగంలో... ఏ.ఆర్.రెహ్మాన్ (గాడ్‌ఫాదర్, తమిళం), శ్రీకృష్ణ (అంతాసాయి, తెలుగు), ఇళయరాజా(మ్యూజిక్ జెర్నీ, తమిళం) ఆల్బమ్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకున్నాయి. గౌరవప్రదమైన ఈ సంగీత పురస్కారాన్ని గ్రాస్‌రూట్ గ్రామీ అవార్డుగా పరిగణిస్తారు. వీరికి గ్రామీ అవార్డు ఎంపికలో సభ్యులుగా వ్యవహరించే అరుదైన అవకాశం కూడా లభిస్తుంది. భారతీయ సంగీతానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ఏ.ఆర్.రెహ్మాన్, ఇళయరాజాల వంటి వారి సరసన తన పాటకూ ఈ గుర్తింపు లభించటం చాలా సంతోషంగా ఉందని శ్రీకృష్ణ తెలిపారు. ఇది తెలుగు పదానికి లభించిన గౌరవంగా పేర్కొన్నారు.
for More Movie News....visit http://www.cinevinodam.com
No comments:
Post a Comment